గ్లామర్ తో ‘యంగ్ బ్యూటీ’ ఎట్రాక్ష‌న్ !

Published on Feb 7, 2019 5:06 pm IST

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగుతెరకు కథానాయికగా పరిచయం అయి ప్రేక్షకుల మనసులను దోచుకుంది నభా నటేష్. అయితే తాజాగా ఈ యంగ్ బ్యూటీ వరుస పెట్టి ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కాగా తన లేటెస్ట్ స్టిల్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన గ్లామర్ తోనూ నభా నేటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

దీనికి తోడూ నటన పరంగానూ నభాలో మంచి ప్రతిభ ఉంది. పైగా ఇతర హీరోయిన్స్ లా దర్శక నిర్మాతలకు ఎలాంటి డిమాండ్స్ కానీ, కండిషన్స్ కానీ పెద్దగా పెట్టదని పేరు కూడా ఉంది. దీనితో నభా నటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

కాగా తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’లో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం :