డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ను వాడేసిన ఇస్మార్ట్ బ్యూటీ!

డార్లింగ్ అంటూ ప్రభాస్ స్లాంగ్ ను వాడేసిన ఇస్మార్ట్ బ్యూటీ!

Published on Apr 18, 2024 1:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ చివరిసారిగా సలార్ (Salaar) మూవీ లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రస్తుతం వరుస భారీ చిత్రాలు చేస్తున్న ఈ హీరో, తదుపరి కల్కి, ది రాజా సాబ్, స్పిరిట్ చిత్రాల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఫేం నభా నటేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో ను షేర్ చేయడం జరిగింది. ప్రభాస్ ఎక్కువగా ఉపయోగించే డార్లింగ్ అనే పదాన్ని ఎన్నిసార్లు సినిమాలో అయితే వాడారో అదే విధంగా హీరోయిన్ నభా నటేష్ ఉపయోగించింది. ఈ ప్రభాస్ స్లాంగ్ తో ఉన్న నభా వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు