రాజారవీంద్ర చేతుల మీదుగా ‘నడికట్టు’ ట్రైలర్ విడుదల

Nadikattu

సహస్ర శ్రీ క్రియేషన్స్ పతాకంపై మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నడికట్టు’. ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ దేవర పొలి, సీనియర్ నటుడు భానుచందర్, శ్వేత, సత్యప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు రాజారవీంద్ర నాలుగు భాషల్లో ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజారవీంద్ర మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్ర యూనిట్‌కు విజయం దక్కాలని ఆకాంక్షించారు. టీఎఫ్ సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. “సినిమాపై ఉన్న మక్కువతో ఈ బ్యానర్‌ను స్థాపించి, తొలి ప్రయత్నంగా ‘నడికట్టు’ను నిర్మించాం. భానుచందర్, ప్రభాకర్, చిత్రం శ్రీను వంటి సీనియర్ నటుల సహకారం, వారి అనుభవం మాకు ఎంతో బలాన్నిచ్చాయి” అని తెలిపారు.

సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని హీరో ధనుష్ దేవర పొలి ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version