నాగ్, నాని సినిమా లేటెస్ట్ న్యూస్ !

శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని నటిస్తోన్న సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో నాగార్జున పాల్గొనబోతున్నాడు. మొదటి షెడ్యూల్ లో నానిపై కొన్ని కామెడి సీన్స్ చిత్రీకరించడం జరిగింది.

మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది త్వరలో తెలియనుంది. కామెడి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ లో అస్వినిదత్ నిర్మిస్తున్నాడు. డాన్ పాత్రలో నాగార్జున, డాక్టర్ పాత్రలో నాని ఈ సినిమాలో అలరించబోతున్నారని సమాచారం. ఈ మల్టి స్టారర్ సినిమా పై ఇటు ఇండస్ట్రీలో అభిమానుల్లో మంచి హోప్స్ ఉన్నాయి.