ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్!

ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్!

Published on Jul 3, 2024 8:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ భారీ బడ్జెట్ మూవీ జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. అయితే ఈ రేంజ్ వసూళ్ల పట్ల, తమ దైర్యం పట్ల హీరో నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ యుగంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ప్రభాస్ క్యాజువల్ గా కూర్చున్న ఫోటోను ఒకటి షేర్ చేశారు. మా ప్రొడక్షన్ కి చాలా కాన్ఫిడెంట్ ఇచ్చారు. నేను చేయాల్సిన పనికి నాకు చాలా స్వేచ్చ ఇచ్చారు. అంతేకాక ప్రభాస్ తెలివైన ఇన్ పుట్లు సినిమా ఎలా ఉంటుందో దానికి మార్గ నిర్దేశం చేయడంలో సహాయ పడటం జరిగింది. అందరి డార్లింగ్, మన భైరవ, ఇప్పుడు ప్రపంచంలో K___ అంటూ ముగించేశారు నాగ్ అశ్విన్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు