ప్రభాస్ హీరోయిన్ కోసం నాగ్ అశ్విన్.. !

Published on Apr 17, 2020 3:00 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారట. ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురును ఫైనల్ లిస్ట్ లో అనుకున్నారని.. లాక్ డౌన్ తరువాత వారిలో ఒకర్ని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

సంబంధిత సమాచారం :