బర్త్‌డే రోజున అమలకు నాగ్ గిఫ్ట్!

బర్త్‌డే రోజున అమలకు నాగ్ గిఫ్ట్!

Published on Sep 12, 2015 6:29 PM IST

nagarjuna-amala

కింగ్ నాగార్జున, అమల.. చూడముచ్చడగా కనిపించే మంచి కపుల్. ఎవరికి వారే తమ తమ స్టార్‌డమ్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ జంట, భార్యా-భర్తలుగానూ మంచి కపుల్ అనిపించుకున్నారు. నేడు అమల పుట్టినరోజు సందర్భంగా నాగ్ ఆమెకు ఈ గిఫ్ట్‌గా తన ప్రొడక్షన్‌లో నిర్మితమవుతోన్న సినిమాలోని పాటను అంకితం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలోని ఓ పాటను ఈ ఉదయం విడుదల చేస్తూ నాగార్జున ఈ పాటను అమలకు అంకితం ఇచ్చారు.

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలోని ‘ఒకోసారి ఓ ముద్దు’ అంటూ సాగే ఓ పాటను నాగార్జున ఈ ఉదయం విడుదల చేశారు. అమలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ పాటను విడుదల చేశారు. ముద్దు గురించి అందంగా తెలియజేస్తూ రాసిన ఈ పాట మంచి ఫీల్ ఇచ్చేలా ఉంది. ఇక ప్రస్తుతం నిర్మలా కాన్వెంట్ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాలో రోషన్ ఓ టీనేజ్ బాయ్‌గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు