‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో బిగ్ బి సందడి

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో బిగ్ బి సందడి

Published on Jan 2, 2015 1:03 PM IST

amithabh-mek

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో బుల్లితెరపై కింగ్ నాగార్జున సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇది హిందీలో పాపులర్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి తెలుగు వెర్షన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు. తెలుగులో ఆ ఛాయలు కనపడకుండా తనదైన శైలిలో నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నిర్వహిస్తున్నారు. వ్యాఖ్యాతగా తనకంటూ ఓ సొంత శైలి సృష్టించుకున్నారు. అయితే ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. ఒకే బుల్లితెర వేదికపై నాగార్జున, అమితాబ్ లను చూసే అదృష్టం త్వరలో అభిమానులకు కలగనుంది.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో అతిధిగా అమితాబ్ పాల్గొన్నారు. హాట్ సీట్ పై కూర్చున్న ఆహుతులకు ప్రశ్నలు సంధిస్తూ టెన్షన్ పెట్టిన అమితాబ్.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో రుచి చూడనున్నారు. మా టీవీ యాజమాన్యం తమ వీక్షకులకు అందిస్తున్న న్యూ ఇయర్ స్పెషల్ ఇది. త్వరలో అమితాబ్, నాగార్జున పాల్గొన్న కార్యక్రమం ప్రసారం అవుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు