వైరల్: కాంట్రవర్సీకి చెక్ పెట్టిన నాగబాబు.!

వైరల్: కాంట్రవర్సీకి చెక్ పెట్టిన నాగబాబు.!

Published on May 18, 2024 1:57 PM IST


ఇటీవల మన టాలీవుడ్ లో ఏపీ ఎన్నికల మూమెంట్ తో పలు రసవత్తర అంశాలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్రెండ్ కోసం ప్రత్యేకంగా వెళ్లి విష్ చేయడం ఆ తర్వాత నాగబాబు పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ నుంచి కాంట్రవర్సీగా మారడం జరిగింది.

అయితే ఈ ఎన్నికల హీట్ లోనే మన వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ నాగబాబు ఓ ట్వీట్ ని పోస్ట్ చేసేసి తదుపరి తన ట్విట్టర్ ఖాతాను డీ యాక్టివేట్ చేసి వెళ్లిపోయారు. దీనితో అసలు తాను ఎవరికోసం ఎందుకోసం చెప్పారు అనేది సస్పెన్స్ గానే నిలవగా అది కాస్తా అల్లు అర్జున్ కోసం అని కొందరు, మరికొందరు పవన్ (Pawan Kalyan) కి సన్నిహితుల కోసం అని ఎవరి వెర్షన్ లు వారు చెప్పుకున్నారు.

ఇంకోపక్క మెగా బ్రదర్ నాగబాబు పై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెరిగిపోయాయి. అయితే వీటి అన్నిటికి నాగబాబు చెక్ పెట్టేసారు. తాను మళ్ళీ తన ట్విట్టర్ అకౌంట్ ని తెరిచి తన “గత ట్వీట్ ని తొలగించాను” అంటూ మరో పోస్ట్ వేయడంతో అసలు ఎవరికోసం పెట్టారో అర్ధం కానీ సస్పెన్స్ కి కాంట్రవర్సీకి ఒక ముగింపు వచ్చినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు