అక్కినేని నాగ చైతన్య మరియు కామెడీ హీరో సునీల్ అన్నదమ్ములుగా ఒక మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. తమిళంలో విజయం సాదించిన ‘వేట్టై’ చిత్రానికి ఇది రిమేక్. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ – లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో వర్షం ఎఫెక్ట్ లో నాగ చైతన్య మీద ఒక ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య – సునీల్ నటన ఆద్యంతం కామెడీగా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన తమన్నా మరియు సునీల్ సరసన ఆండ్రియా జేరేమియా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వర్షంలో ఫైట్స్ చేస్తున్న నాగ చైతన్య
వర్షంలో ఫైట్స్ చేస్తున్న నాగ చైతన్య
Published on Sep 4, 2012 12:50 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మెగాస్టార్‌తో బుచ్చిబాబు మూవీ.. అయ్యే పనేనా..?
- విశాల్‌కు మరో షాక్.. ‘మకుటం’తో మరో ఎదురుదెబ్బ..!
- వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!
- మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?
- ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ని ఎగ్జైట్ చేసిన రోల్ ఇదేనా? 7 ఏళ్ళు పట్టింది మార్చడానికి!
- సమీక్ష: పాంచాలి పంచ భర్తృక – కొంతవరకే వర్కవుట్ అయ్యే కామెడీ క్రైమ్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!


