శేఖర్ కమ్ముల హెల్ప్ తీసుకుంటున్న నాగ చైతన్య

శేఖర్ కమ్ముల హెల్ప్ తీసుకుంటున్న నాగ చైతన్య

Published on Oct 14, 2019 3:57 PM IST

అక్కినేని హీరో నాగ చైతన్య చేస్తున్న చిత్రాల్లో శేఖర్ కమ్ముల సినిమా కూడా ఉంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇందులో చైతన్య తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నాడు. కేవలం కనిపించడమే కాదు.. తెలంగాణ యాసలో మాట్లాడతారట కూడా.

చైతన్య ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తెలంగాణ యాస ట్రై చేసింది లేదు. పైగా ఆ యాస ఆయనకు అలావాటు లేదు కూడ. అందుకే పర్ఫెక్షన్ కోసం అయన యాసపై పట్టు పెంచుకునే సాధనలో ఉన్నారట. అందుకు తెలంగాణ భాష మీద పూర్తి పట్టున్న శేఖర్ కమ్ముల హెల్ప్ తీసుకుంటున్నాడట.

ఇకపోతే ఈ చిత్రంలో చైతూకు జోడీగా సాయి పల్లవి నటించనుంది. ఇది కూడా పూర్తి ఫ్యామిలీ కమ్ రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని
నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు