కొత్త లుక్ లో నాగ చైతన్య !

కొత్త లుక్ లో నాగ చైతన్య !

Published on Nov 21, 2018 7:34 PM IST


‘సవ్యసాచి’ చిత్రం తరువాత యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సమంత తో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వైజాగ్ లోని రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ గా చైతు ఫుల్ గడ్డం తో కొత్తగా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుబ్బరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈచిత్ర షూటింగ్ ని ఫిబ్రవరిలో పూర్తి చేసి సినిమాని సమ్మర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై ‘కృష్ణార్జున యుద్ధం’ నిర్మాత హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు