గరుడ వేగ డైరెక్టర్ తో నాగ చైతన్య !

Published on Feb 7, 2019 8:44 am IST

వరుస సినిమా లతో ఫుల్ బిజీ లో వున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య అందులో భాగంగా ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ లో నటించనున్నాడు చై. ఈనెల 22 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తోపాటు దిల్ రాజు బ్యానేర్ లో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు. నూతన దర్శకుడు ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక ఇవే కాకుండా తాజాగా గరుడ వేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు కూడా చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమా ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

సంబంధిత సమాచారం :