యాక్షన్ మూడ్ లో నాగ చైతన్య సినిమా

యాక్షన్ మూడ్ లో నాగ చైతన్య సినిమా

Published on Sep 11, 2014 3:58 PM IST

Naga-Chaithanya1
సుధీర్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ కిచ్చా(ఇద్దరమ్మాయిలతో ఫేం) స్టంట్స్ సమకూరుస్తున్నారు.

కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఅర్ సంగీత దర్శకుడు. ఫస్ట్ మూవీ ‘స్వామి రా రా’తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కృషి చేస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని దర్శకుడు చెప్పారు.

తాజా వార్తలు