“తండేల్” నుండి వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేసిన చైతూ!

“తండేల్” నుండి వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేసిన చైతూ!

Published on May 22, 2024 8:01 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తదుపరి చిత్రం తండేల్. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో క్యూరియాసిటి నెలకొంది. ఈ చిత్రం నుండి తాజాగా హీరో నాగ చైతన్య ఒక వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో చైతూ ఆకట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ ను ఈ లుక్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తో సక్సెస్ పై హీరో చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

పాక్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్లు జైల్లో ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు