
2015 మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ‘ప్రేమమ్’ సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ అని పించుకోవడమే కాకుండా మలయాళంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళంలో అన్ని పాత సినిమాల రికార్డ్స్ ని స్మాష్ చేసి టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనల్ గా ఆ ఛాన్స్ టాలీవుడ్ యంగ్ అండ్ అక్కినేని ఫ్యామిలీ హన్డ్సం హీరో నాగ చైతన్యని వరించింది. నాగ చైతన్య సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం నాగ చైతన్య నెక్స్ట్ మూవీ ప్రేమమ్ రీమేక్ అని చెబుతున్నారు.
‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటిని ‘ప్రేమమ్’ రీమేక్ వెర్షన్ కి డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ముందు నుంచి నాగ చైతన్య చందూ మొండేటితో సినిమా చేయాల్సి ఉంది. ఫైనల్ గా వీరి సినిమాకి కథ ఇలా ఫిక్స్ అయ్యింది. ‘జులాయి’, ‘S/O సత్యమూర్తి’ లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు ఫైనల్ అయ్యాయి. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే ప్రేమమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది, ప్రస్తుతం చందూ మొండేటి తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేస్తున్నాడు.