
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు కొన్ని పాటల చిత్రీకరణ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయ్యిందని నాగ చైతన్య తెలిపాడు. ‘నా 10వ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కొన్ని పాటలు, క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ మాత్రమే మిగిలింది. అతి త్వరలోనే మీరందరూ ఎగ్జైట్ అయ్యే న్యూస్ వస్తుందని’ నాగ చైతన్య ట్వీట్ చేసాడు.
నాగ చైతన్య చెప్పిన దాని ప్రకారం త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. నాగ చైతన్య ఈ సినిమాలో ఓ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. నాగచైతన్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.