
‘ఏం మాయ చేసావే’ సినిమాతో అక్కినేని నాగ చైతన్యకి తన కెరీర్లో తొలి బిగ్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే గౌతమ్ మీనన్ నాగ చైతన్య పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ తీసాడు. చెన్నై షెడ్యూల్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి నిన్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాని ప్రమోట్ చేసిన గౌతం మీనన్ నేటి నుంచి నాగ చైతన్య లేటెస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసాడు.
అది కూడా ఆంధ్రలో పచ్చని లొకేషన్స్ కి నెలవైన అరకులో లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. 3 రౌలపాటు జరిగే ఈ షార్ట్ అరకు షెడ్యూల్లో నాగ చైతన్య – మలయాళ భామ మంజిమ మోహన్ పై కొన్ని సీన్స్ ని షూట్ చేయున్నారు. మొదటి షెడ్యూల్ లోనే ఈ సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసారు. టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తున్నాడు. కోన వెంకట్ ఇప్పటి వరకూ ఈ సినిమా తెరకెక్కిన షూటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ ని పెట్టిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

