అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న అవైటెడ్ థ్రిల్లర్ చిత్రమే వృష కర్మ. తండేల్, విరూపాక్ష హిట్స్ తర్వాత ఇద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వాటికీ తగ్గట్టుగా సాలిడ్ ప్లానింగ్ తో షూట్ ని మేకర్స్ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
ఇలా సినిమాపై కొత్త అప్డేట్ బయటకి వచ్చింది. కొన్నాళ్ల కితం రాజస్థాన్ లో స్టార్ట్ చేసిన కీలక షెడ్యూల్ ని మేకర్స్ ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసేసారు. అక్కడ పలు కీలక ప్రాంతాల్లో సినిమాని షూట్ చేసినట్టు ఇపుడు తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయట. ప్రస్తుతం సీజీ వర్క్స్ చేస్తూ ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ క్వాలిటీ విజువల్స్ కలిగిన మిస్టికల్ థ్రిల్లర్ ని మేకర్స్ ప్రామిస్ చేస్తున్నట్టు టాక్. మరి ఈసారి కార్తీక్ ఎలాంటి ట్రీట్ అందిస్తాడో చూడాలి.
