వైరల్: ‘బుజ్జి’ తో చైతూ థ్రిల్లింగ్ రైడ్

వైరల్: ‘బుజ్జి’ తో చైతూ థ్రిల్లింగ్ రైడ్

Published on May 25, 2024 5:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి”. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా గర్వించే మరో సినిమాగా రాబోతుంది. అయితే ఈ చిత్రం విషయంలో రీసెంట్ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మేకర్స్ స్పెషల్ గా తయారు చేసిన సూపర్ కార్ బుజ్జి కోసమే అని చెప్పాలి.

దీనిని లాంచ్ చేసాక మరిన్ని స్పెషల్ వీడియోస్ బయటకి వస్తుండగా లేటెస్ట్ గా ఈ కార్ ని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య రైడ్ చేసిన విజువల్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ వీడియోలో అయితే చైతు తన అనుభవాన్ని చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. తాను షాక్ లో ఉన్నాయని యూనిట్ ఇంజినీరింగ్ లో అన్ని రూల్స్ బ్రేక్ చేసేశారని క్రేజీ కామెంట్స్ చేసాడు. అలాగే ఈ కార్ రైడ్ పై వదిలిన విజువల్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారగా తన రైడ్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు