నాగ చైతన్య సినిమాను అలా సెట్ చేశారన్నమాట ?

Naga Chaitanya

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరివైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా కూడ చేస్తున్నారు. దీని తర్వాత నందిని రెడ్డి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి లాంటి వారితో వర్క్ చేస్తారనే వార్తలు వచ్చినా వాటిలో ఏదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడు కొత్తగా మరొక దర్శకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనే తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగ చైతన్య ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తారని అంటున్నారు.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు నిర్మిస్తారట. నిజానికి తరుణ్ భాస్కర్ సురేష్ బాబు నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అది కూడ వెంకటేష్ హీరోగా. ఇప్పటికే మొదలుకావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ మెటీరియలైజ్ కాలేదు. వెంకీ మాత్రం ‘నారప్ప, ఎఫ్ 3’ చేస్తూ ‘దృశ్యం 2’కి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో నాగ చైతన్య ప్రాజెక్ట్ చర్చల్లోకి రావడం చూస్తే వెంకీ చాలా బిజీగా ఉండటం మూలాన ఆయనకు బదులు చైతన్యను తరుణ్ భాస్కర్ చేతిలో పెట్టారేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆసక్తికరంగానే అనిపిస్తోంది.

Exit mobile version