పంచెకట్టుతో అలరించిన మామ, అల్లుళ్లు

పంచెకట్టుతో అలరించిన మామ, అల్లుళ్లు

Published on Sep 2, 2019 6:19 PM IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈరోజు వినాయకచవితి కావడంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మామ అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరూ సంప్రదాయకర రీతిలో పంచెకట్టు కట్టి అలరించారు. ప్రేక్షకులను పోస్టర్ బాగా ఆకట్టుకుంది.

ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘మజిలీ’లాంటి హిట్ తరవాత చైతన్య, ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ చేస్తున్న చిత్రం కావడంతో ‘వెంకీ మామ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు