చైతూ “కస్టడీ” పై లేటెస్ట్ అప్డేట్!


అక్కినేని హీరో నాగ చైతన్య తదుపరి కస్టడీ అనే ద్విభాషా చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1, 2023 న సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

నెటిజన్లు అంతా టీజర్ గురించేనని భావిస్తున్నారు. అది నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ పోలీస్ డ్రామాలో చైతూ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version