మార్చి 20న నాగ చైతన్య ‘దోచేయ్’..??

Naga-Chaitanyas-first-look
సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ & కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల టాక్. మరోవైపు ఈ సినిమాకు ‘దోచేయ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

చైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కానుంది.

Exit mobile version