క్లైమాక్స్ షూట్ లో నాగ చైతన్య ‘మాయగాడు’

క్లైమాక్స్ షూట్ లో నాగ చైతన్య ‘మాయగాడు’

Published on Nov 11, 2014 1:40 PM IST

naga-chaitanya
సినిమా సినిమాకి అస్సలు గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య నటించిన ‘ఒకలైలా కోసం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇది రిలీజ్ అయ్యి ఒక నెల రోజులకే నాగ చైతన్య మరో చిఎన్మా షూటింగ్ ని చివరి దశకు తీసుకోచ్చేసాడు. ప్రస్తుతం నాగ ఛైతన్య ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సెట్స్ పై ఉంది.

గత 40 రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్ ని హైదరబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూటింగ్ లో నాగచైతన్య తో పాటు వైవా హర్ష అండ్ టాప్ కమెడియన్స్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఈ చిత్ర టీం ‘మాయగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు