నాగ చైతన్య కొత్త చిత్రం మొదలైంది

Published on Sep 9, 2019 2:38 pm IST

‘మజిలీ’ చిత్రం తర్వాత అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజే హైదరాబాద్లో మొదలైంది. ఈ చిత్రంలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువైంది.

అంతేగాక ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రాజెక్ట్ మీద ట్రెడ్ వర్గాలు కూడా ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. శేఖర్ కమ్ముల స్టైల్ ఎలాగూ ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాలే.. పైగా ఆ జానర్ సినిమాలే చైతన్యకు గతంలో మంచి విజయాల్ని అందించాయి. కాబట్టి వీరి కాంబినేషన్ వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇకపోతే ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More