గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఏమాయ చేసావే’.. ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, నాగ చైతన్య కెరీర్ కి బిగ్ బూస్టప్ ఇచ్చిన సినిమా. దాదాపు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టొరీ ఉండేలా, సెకండాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే ఫీల్ వచ్చేలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.
షూటింగ్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా చేసుకుంటూ వచ్చిన ఈ చిత్ర టీం ఈ సినిమాని ఇదే ఏడాదిలో రిలీజ్ చేసెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అదనులో భాగంగానే డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఏదో ఓక వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఇప్పటికే రెండు సినిమాలు ఉండడం వలన ఎక్కువ భాగం డిసెంబర్ 3వ వారంలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫేమస్ రైటర్ కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
నాగచైతన్య సరసన మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


