నాగ్ బర్త్ డే గిఫ్ట్ గా చైతన్య మూవీ ఫస్ట్ టీజర్

నాగ్ బర్త్ డే గిఫ్ట్ గా చైతన్య మూవీ ఫస్ట్ టీజర్

Published on Aug 17, 2015 7:59 PM IST

nagarjuna_naga-chaitanya
2010లో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఓ అందమైన మాయలో పడేసింది. ఇప్పటికీ చాలా మంది ఆ మాయ నుంచి బయటకి రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మళ్ళీ అదే అక్కినేని నాగ చైతన్యకి తన కెరీర్లో తొలి బిగ్ హిట్ ఇదే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయ్యింది. నిన్నటి నుంచి అరకులో లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టారని అక్కడే మూడు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.

తాజాగా ఈ చిత్ర టీం అనౌన్స్ చేసిన సమాచారం ప్రకారం నాగ చైతన్య – గౌతమ్ మీనన్ ల మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ని నాగార్జున బర్త్ డే కానుకగా ఆగష్టు 29న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే రోజుల అఖిల్ ఫస్ట్ మూవీకి సంబందించిన ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చెయ్యడానికి సిద్దమయ్యారు. అనగా నాగార్జున బర్త్ డే అయిన ఆగష్టు 29న నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిల ఫస్ట్ లుక్ టీజర్స్ రిలీజ్ అయ్యి అక్కినేని అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాయి. నాగ చైతన్య సినిమాని తెలుగులో టాలీవుడ్ ఫేమస్ రైటర్ కోన వెంకట్ నిర్మిస్తున్నాడు.

మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గౌతమ్ మీనన్ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ ని పెట్టిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు