
అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ ని ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నాడు. నాగ చైతన్య వరుసగా తమ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. గత ఏడాది ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒక లైలా కోసం సినిమా చేసి విజయం అందుకున్నాడు. ఇప్పుడు స్వామి రారా సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగ చైతన్య లిస్టు లోకి మరో కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. అన్తనే కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న చందు మొండేటి. చందు చెప్పిన కథ నాగ చైతన్యకి బాగా నచ్చడంతో తనతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి అధికారిక సమాచారం విడుదల కానుంది.

