చైతు సరసన ముగ్గురు హీరోయిన్స్ !

చైతు సరసన ముగ్గురు హీరోయిన్స్ !

Published on Apr 5, 2021 8:10 PM IST

Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ సినిమాలో చైతు సరసన రాశి ఖన్నా ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘థాంక్యూ’లో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించిబోతున్నారు. ప్రతిభావంతులైన యంగ్ బ్యూటీస్ మాళవిక నాయర్ మరియు అవికా గోర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నట్లు తాజా సమాచారం.

ఇక డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీకి గొప్ప సినిమా ఇచ్చాడు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అంటూ అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యకి ‘థాంక్యూ’ అంటూ ఎలాంటి హిట్ ను ఇస్తాడో చూడాలి. దిల్ రాజు తన బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు