బెంగుళూరు డేస్ రీమేక్ లో నాగ చైతన్య.?

బెంగుళూరు డేస్ రీమేక్ లో నాగ చైతన్య.?

Published on Jul 1, 2014 4:20 PM IST

Naga-Chaithanya1
ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ పివిపి బ్యానర్ ఇటీవలే మలయాళంలో సూపర్ హిట్ అయిన బెంగుళూరు డేస్ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో నాగ చైతన్య ఈ సినిమాలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరో వైపు సమంత కూడా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బెంగుళూరు డేస్ సినిమా బెంగుళూరు లో నివసించే ఓ ముగ్గురు యంగ్ స్టర్స్ చుట్టూ తిరిగే కథ. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో రీమేక్ కానున్న ఈ సినిమా ఎలా ఉంటుంది? ఎవరెవరు నటిస్తారు? ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది..

తాజా వార్తలు