టీజర్: రాక్షసుడుని ఎదిరించడానికి వచ్చిన ‘అశ్వథామ’

Aswathama 4

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ. నూతన దర్శకుడు రమణ తేజ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య అన్యాయాలను ప్రశ్నించే సామజిక స్పృహ కలిగిన యువకుడిగా నటిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ టీజర్ టాలీవుడ్ ఏంజెల్ సమంత అక్కినేని విడుదల చేశారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఈచిత్రంలో మాస్ హీరోలా సరి కొత్తగా కనిపిస్తున్నాడు.

విశాఖ వేదికగా జరిగే ఓ పెద్ద మెడికల్ మాఫియాతో ఓ యువకుడు చేసే యుద్ధమే అశ్వథామ చిత్రం అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తన స్వార్ధం కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకొనే ఓ మాఫియా లీడర్ ని నాగ శౌర్య ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ప్రధాన కథ. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సీరియస్ గా సాగిన అశ్వథామ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఉషా ములుపురి నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version