మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్స్ లో వచ్చిన ఈ చిత్రం అసలు వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో కూడా చప్పుడు లేకుండా వచ్చేసింది.
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచే సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ ప్లాప్ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు అమెజాన్ లో చూడొచ్చు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ దేసిన అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు.
కేవలం యాక్షన్ పార్ట్ వరకు బాగా తీసి మిగతా కథా కథనాలు అవుట్ డేటెడ్ గా నడిపించడంతో సినిమా భారీ ప్లాప్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో నటి శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించగా విధి యాదవ్ హీరోయిన్ గా నటించింది. అలాగే హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాని శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
