దర్శకేంద్రుడు క్రేజీ ప్రాజెక్ట్ లో యంగ్ హీరో?

Published on May 30, 2020 1:35 am IST

శతాధిక చిత్రాల దర్శకుడిగా ఉన్న రాఘవేంద్ర రావు మెగా ఫోన్ పట్టి చాలా కాలం అవుతుంది. ఆయన చివరి చిత్రం ఓమ్ నమో వెంకటేశాయ. నాగార్జున, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో భక్తి రస చిత్రంగా వచ్చింది. ఈ మూవీ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తుంది. కాగా ఆయన నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎదురు చుస్తున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ జయంతి నాడు రాఘవేంద్ర రావు ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

ఆయన ముగ్గురు హీరోయిన్స్ మరియు ముగ్గురు దర్శకులతో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మూవీపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకున్నారు. ఐతే మూవీ ఉంది త్వరలోనే అప్డేట్ ఇస్తాను అని నిన్న ఆయన తెలియజేశారు. కాగా ఈ మూవీలో హీరో ఎవరు అనేది సస్పెన్సు గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం హీరో నాగ శౌర్య చేస్తున్నారంటూ సమాచారం ఉంది. గతంలో కూడా దీనిపై వార్తలు రాగా ఆయనే నటించే అవకాశం కలదట.

సంబంధిత సమాచారం :

More