నాగ‌శౌర్య మొదటి షెడ్యూల్ పూర్తి చేశాడట !

Published on May 29, 2019 1:00 am IST

‘ఛ‌లో’ లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో రమణ తేజ దర్శకత్వంలో వ‌స్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూట్ చేశారు. జూన్ లో రెండ‌వ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. కాగా మెద‌టి షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందట. ద‌ర్శ‌కుడు పనితనం చాలా బాగుందని చెబుతుంది యూనిట్.

ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ‌శౌర్యకి జంట‌గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోసారి ప్రేక్ష‌కుల అలరించబోతుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషాముల్పూరి,

సంబంధిత సమాచారం :

More