కొత్త సినిమా షూటింగ్‌తో నాగ శౌర్య బిజీబిజీ!

కొత్త సినిమా షూటింగ్‌తో నాగ శౌర్య బిజీబిజీ!

Published on Jun 15, 2015 8:07 PM IST

Naga-Shourya
‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమ కళ్ళను తన వైపుకు తిప్పుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించారు నందిని రెడ్డి. రెండో సినిమా ‘జబర్దస్త్’ పరాజయం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆమె, తాజాగా నాగ శౌర్యతో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే! గత నెలలో మొదలైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

లవర్ బాయ్‌గా మంచి పేరు సంపాదించుకున్న నాగ శౌర్యతో నందిని రెడ్డి తన స్టైల్ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగిపోతోందని, ఇంకా టైటిల్ ఏదీ అనుకోలేదని, త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నామని నాగ శౌర్య అభిమానులడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక నాగ శౌర్య హీరోగా నటించిన సినిమా జాదూగాడు ఈ నెల్లోనే విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు