ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన నాగవంశీ.!

ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన నాగవంశీ.!

Published on Apr 17, 2024 12:53 PM IST


రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి ఈ చిత్రాన్ని యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మాణం వహించగా మార్కెట్ లోకి తనదైన శైలిలో తీసుకొచ్చాడు. అయితే రీసెంట్ గానే తాను తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఓ భారీ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడని పలు వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ సినిమానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం “దేవర” అని స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే లేటెస్ట్ గా ఈ తదితర రూమర్స్ విషయాల్లో నాగవంశీ సాలిడ్ క్లారిటీ ఇచ్చేసారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు, అప్డేట్స్ విషయంలో ఎలాంటి నిజం లేదు అని అలాగే ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎలాంటి వార్తలు ఉన్నా అధికారికంగా తమ బ్యానర్ నుంచే వస్తాయి అని అందుకే దయచేసి తప్పుడు వార్తలు నమ్మవద్దని తెలిపారు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు