ఇన్నేళ్ల విశ్వక్ సేన్ నటనపై సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చిన నాగవంశీ.!

ఇన్నేళ్ల విశ్వక్ సేన్ నటనపై సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చిన నాగవంశీ.!

Published on May 30, 2024 1:00 PM IST


మన టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా అంజలి మరో సాలిడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సమ్మర్ లో అయితే ఇది గట్టి అంచనాలు నెలకొన్న ఈ చిత్రంని దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించగా ఇపుడు అగ్రెసివ్ ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐదేళ్లలో విశ్వక్ సేన్ నటన ట్రైలర్ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో తన నటనతో విశ్వ రూపం చూపిస్తాడు అని ఖచ్చితంగా ఇది బలంగా నమ్ముతున్నట్టుగా తాను తెలిపారు. దీనితో ఓ పెర్ఫామర్ గా కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ లో నటించింది అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. రేపు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు