ఆనందోత్సాహాల నడుమ నిహారిక వివాహం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్

NagaBabu

నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొద్దిసేపటి క్రితమే చైతన్య జొన్నలగడ్డతో ఏడు అడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది. చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు అరవింద్ సహా మెగా కుటుంబంలోని చిన్నా పెద్దా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు. పెళ్లి పీఠల మీద బంగారు వర్ణపు దుస్తులతో నిహారిక, చైతన్య జంట మెరిసిపోయారు.

కుటుంబ సభ్యులంతా వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు కుటుంబసభ్యులతో పాటు అతికొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. మెగా హీరోలంతా ఒక చోటుకి చేరుకుని ఆనందంగా గడపడంతో వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కుమార్తె వివాహం సందర్బంగా నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. ఆ సమయంలో నా కూతురు పెద్దదైందని నమ్మడానికి నాకు సంవత్సరాలు పట్టింది. ఈసారి ఇంకెన్ని ఏళ్లు పడుతుందో కాలమే చెప్పాలి’ అంటూ మనసులో భారాన్ని బయటపెట్టారు.

Exit mobile version