
ఈ కాలంలో ఒక పెద్ద సినిమాని రిలీజ్ చేయాడానికి నిర్మాతలు ఒకే ఒక్క పంధా ని అనుసరిస్తారు. సినిమా ని ఎన్ని థియేటర్లలో విడుదల చేయగలిగితే అన్నింటి లో విడుదల చేసి తెగ ప్రచారం చేసి రెండు వారాల్లోనే డబ్బు సంపాదిస్తారు.
పైరసీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఈ పంధా ఒకటే నిర్మాతలని కాపాడుతుంది. కాని అక్కినేని నాగార్జున ‘మనం’ విడుదల కి ఒక కొత్త పంధా ని అనుసరించనున్నారు. ఈ చిత్రాన్ని కొన్ని థియేటర్లలోమాత్రమే విడుదల చేసి ఎక్కువ కాలం ప్రదర్శింపబడేలా జాగ్రత్త తీసుకుంటున్నారు.
అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ‘మనం’ సినిమా ఎక్కువ కాలం విజయవంతంగా ప్రదర్శింపబడలాని నాగార్జున కోరుకుంటున్నారు.
‘మనం’ నాగార్జున అంచనాలుకు అనుకూలంగా ప్రదర్శింపబడాలని డా. యె.యెన్. ఆర్ కి ఒక ఎంతో ప్రత్యేకమైన గొప్ప చిత్రం గా నిలవాలని ఆశిద్దాం.

