‘బ్యాచ్‌ల‌ర్’ పై నాగ్ సంతృప్తి !

‘బ్యాచ్‌ల‌ర్’ పై నాగ్ సంతృప్తి !

Published on Sep 15, 2020 2:11 AM IST

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది. అందుకే నాగ్ ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు. కాగా తాజాగా అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూసారని.. అవుట్ ఫుట్ పై నాగ్ చాల హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.

ఇక కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ వచ్చే ఏడాదికి మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు