కింగ్ నాగార్జున సరసన నటించబోయే హీరోయిన్ కోసం దర్శకనిర్మాతల వెతుకులాట ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ‘మనం’ తర్వాత కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణను ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది. ఎవ్వరినీ కన్ఫర్మ్ చేయలేదని సమాచారం.
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్-ప్లే ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ సమకూరుస్తున్నారు. ‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన…’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


