ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో అక్కినేని అఖిల్ నటించిన లాంగ్ అవైటెడ్ సినిమా “లెనిన్” కూడా ఒకటి. ఏజెంట్ ప్లాప్ తర్వాత అఖిల్ కి జరిగిన చిన్నపాటి ప్రమాదం తనని నెక్స్ట్ రిలీజ్ కి చాలా దూరం చేసింది. అయినప్పటికీ అఖిల్ పడి లేచిన కెరటంలా కొత్త ఎనర్జీతో వస్తున్నాడు.
అయితే ఈ ప్రయాణంలో తండ్రి అక్కినేని నాగార్జున కూడా చేయూత అందించడం జరిగింది. అయితే కేవలం కొడుకు ఫ్యూచర్ కోసమే కాకుండా నిర్మాతగా కూడా మారి లెనిన్ ని ఎంతో నమ్మారు. ఈ నేపథ్యంలో తాను ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ‘మనం’ సినిమా తర్వాత ఇదే అని చెప్పడం ఫ్యాన్స్ లో విశేషం గా మారింది.
2014 లో విడుదల అయ్యిన మనం చిత్రం అక్కినేని కుటుంబంలో ఒక చెరగని ముద్ర వేసుకున్న చిత్రం. ఆ సినిమాకి తాను అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి పని చేసానని ఆ సినిమాకి నాన్న కోసం పని చేస్తే ఇప్పుడు మళ్ళీ తన కొడుకు కోసం లెనిన్ కి పూర్తి శ్రద్ధ, బాధ్యత పెట్టినట్టు నాగార్జున తెలిపారు. సో లెనిన్ రిజల్ట్ కూడా ఆ రేంజ్ లో స్పెషల్ గా నిలిచిపోతుందో లేదో ఈ జూలై 10తో తేలిపోతుంది.
