టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు వరుసగా ఊపందుకుంటున్నాయి. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – తమిళ యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర టీం లండన్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ లాంగ్ లండన్ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసారు. ఈ సినిమాల్లో తమన్నానే కాకుండా ఓ మెయిన్ రోల్ కోసం సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియేల్ల దిమెత్రియాడెస్ కనిపించనునుంది.
షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యలేదు. ఇటీవలే ఈ సినిమాకి ‘దోస్త్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని అన్నారు. కానీ తాజాగా ఈ చిత్ర టీంకి బాగా సన్నిహితులైన వారు తెలిపిన సమాచారం ప్రకారం ‘ఊపిరి’ అనే టైటిల్ ని ఈ చిత్ర టీం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర టీం త్వరలోనే ఓ ఫైనల్ టైటిల్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ అనుష్క ఓ ముఖ్య పాత్రలో కనిపించి థ్రిల్ చేయనుందని అంటున్నారు. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
