
చాలా రోజుల నుండి ఫిలిం నగర్ లో ఒక వార్త సంచలనం రేపుతుంది, అదే నాగార్జున జూ.ఎన్టీఅర్ లు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ వార్త నిజమే అని, ఈ సినిమా ఆగష్టులోమొదలవుతుందని తెలిపారు. ‘మున్న’, ‘బృందావనం’, ‘ఎవడు’ వంటి సినిమాలు తీసిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇంతకుముందు ‘సీతారామరాజు’ సినిమాలో నాగార్జున జూ.ఎన్టీఅర్ తండ్రి హరికృష్ణతో కలిసి నటించారు.
నాగార్జున ప్రస్తుతం ‘మనం’ సినిమా ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉండగా, జూ.ఎన్టీఅర్ ‘రభస’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

