చైతన్యని మరో మెట్టేక్కించే సినిమా ‘ఒక లైలా కోసం’ – నాగ్

OKa_laila_Kosam

అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘ఒక లైలా కోసం’. చాలా రోజుల క్రితమే రిలీజ్ అనుకున్నా సరైన సమయం కాదని రిలీజ్ ని కాస్త వాయిదా వేసారు. ఫైనల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర నిర్మాత అయిన నాగార్జున ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా మనం తర్వాత వస్తున్న ఈ మూవీ తన బ్యానర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అని అంటున్నారు.

ఒక లైలా కోసం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘గుండెజారి గల్లంతయ్యిందే చూసి బాగా ఇంప్రెస్ అయిన్ విజయ్ తో సినిమా చేద్దాం అనుకున్నా అతను చెప్పిన కథ చైతుకి బాగా సెట్ అవుతుంది,. అందుకే నేను నిర్మించాను. పెర్ఫార్మన్స్ పరంగా చైతన్యని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది. మనం తర్వాత మా బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ఇదని’ అన్నాడు.

విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version