
జూలై 11న రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం’ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇండస్ట్రీలోని వారందరికీ బాగా నచ్చేసింది. దాంతో చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున ఈ సినిమా చూసి ఈ చిత్ర టీం ని మెచ్చుకున్నారు.
‘దృశ్యం’ సినిమా చూసాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. వెంకీ ఒక స్టార్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన పాత్రలో చాలా బాగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు’. అలాగే మాట్లాడుతూ ‘దృశ్యం సినిమాని బాగా హండిల్ చేసారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సి ఉందని’ అన్నాడు.
నాగార్జున, వెంకటేష్ కమర్షియల్ సినిమాలనే కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయడం వైపు ఆసక్తి చూపుతున్నారు.