బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ (Dhurandhar ) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్ట్ చేయగా ఈ మూవీ ఏకంగా రూ.1400 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ములేపింది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించాడు.
అయితే, అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాలోని అక్షయ్ ఖన్నా రోల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ పాత్రను ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను ఈ పాత్ర చేయాలని చిత్ర యూనిట్ సంప్రదించిందట.
కానీ, ఆ సమయంలో నాగ్ కుబేర, కూలీ చిత్రాల్లో నటిస్తుండటంతో ఆయన ఈ సినిమాకు నో చెప్పాడట. కట్ చేస్తే, ఇప్పుడు రెహమాన్ డెకాయిట్ పాత్రకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటంతో నాగ్ ఈ పాత్ర చేసి ఉండాల్సిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక నాగ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.


