నాగ్ – పూరి సినిమా ఫిక్సేనా ?

నాగ్ – పూరి సినిమా ఫిక్సేనా ?

Published on Aug 24, 2020 9:00 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన శివమణి (2003) మరియు సూపర్ (2005) సినిమాలతో తమది క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు. అయితే ఇటివలే వీరిద్దరూ మళ్ళీ కలిసి మరో సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేసింది. అయితే దాదాపు వీరి కలయికలో మరో సినిమా దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగ్ తో సినిమా ఉంటుందట.

కరోనా లాక్ డౌన్ లో పూరి నాగ్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. ఈ కరోనా ఖాళీ సమయం తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. తాజాగా పూరి స్క్రిప్ట్ పూర్తి చేశాడట. ‘శివ మణి’, ‘సూపర్’ సినిమాల్లో నాగ్ ను చాల కొత్తగా చూపించాడు పూరి. మరి ఇప్పుడు రాబోయే కొత్త సినిమాలో కూడా పూరి ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు