‘బంగార్రాజు’ మీద నాగ్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు

‘బంగార్రాజు’ మీద నాగ్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు

Published on Jul 1, 2019 8:23 PM IST

కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని గతంలోనే నిర్ణయించుకున్నారు.

దానికి ‘బంగార్రాజు’ అనే పేరు కూడ పెట్టారు. కథ మీద చాలా రోజులు వర్క్ చేసిన కళ్యాణ్ కృష్ణ ఎట్టకేలకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తయారుచేశారట. ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. అది కూడా ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఆగష్టు 9న రిలీజ్ చేయనున్నారు. కాబట్టి ఆగష్టు నుండే ‘బంగార్రాజు’ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని నాగ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు